బాడ్సీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
మోపాల్/నందిపేట: ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు ఫ్లెక్సీల సెగ తగిలింది. తమ గ్రామాల అభివృద్ధి ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోపాల్ మండలం బాడ్సిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. బాడ్సి చౌరస్తాతో పాటు స్కూల్ వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాడ్సి ప్రైమరీ పాఠశాలకు బాజిరెడ్డి వస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒక్కసారి కూడా బాడ్సికి రాలేదని, ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని వారు ఆరోపిస్తున్నారు. కానీ అప్పటికే ఎమ్మెల్యే పర్యటన రద్దయ్యింది.
ఆర్మూర్ మండలం తల్వెదలో..
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తల్వెదలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా గ్రామంలో ఫ్లెక్సీలు వెలియడం కలకలం రేపింది. ఇచ్చిన హామీలు మరిచి తమ గ్రామానికి ఏమి చేశారంటూ ఎందుకు వస్తున్నావు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో ఏడు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment