ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్
● ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
డిచ్‌పల్లి: దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం డిచ్‌పల్లి కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ‘గృహలక్ష్మి’ పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబరిమోహన్, జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిర పాల్గొన్నారు. రూరల్‌నియోజకవర్గంలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న 40 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
70 దేవాలయాలకు రూ.130 కోట్లు
సిరికొండ: నియోజకవర్గంలో 70 దేవాలయాలకు రూ.130 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. న్యావనందిలో రూ. 45 లక్షలతో నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత వాసిగా తనకు అన్ని బాధలు తెలుసని అందుకే ఎక్కడ ఏం కావాలో ఆ పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ మాన్‌సింగ్, వైస్ ఎంపీపీ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment