తెయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, కంట్రోలర్ సంపత్‌కుమార్ మంగళవారం విడుదల చేశారు. బీఏలో 28.24 శాతం, బీకాంలో 34.10, బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో 40.38, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ లో 23.89, బీబీఏలో 42.21, బీసీఏలో 9.09శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 19,574మంది విద్యార్థులు హాజరుకాగా , 6,436మంది (32.88శాతం) ఉత్తీర్ణులైనట్లు పేర్కొ న్నారు. మాజీ కంట్రోలర్ ఎం అరుణ, అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment