రైతులకు సాంకేతికతను చేరువ చేయాలి
రుద్రూర్: వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు స మన్వయంతో పని చేస్తూ రైతులకు సాంకేతికతను మరింత చేరువ చేయాలని పొలాస వ్యవసాయ పరి శోధన కేంద్రం ఇన్‌చార్జి, సహ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీలత అన్నారు. రు ద్రూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన శాసీ్త్రయ సలహా మండలి సమావేశానికి ఆమె హాజరయ్యారు. జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం, కామరెడ్డి జిల్లాలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గత ఏడాది చేపట్టిన పరిశోధన అంశాల మీద, వచ్చే వానకాలం, యాసంగిలో చేపట్టబోయే పరిశోధన అంశాలపై సమీక్ష నిర్వహించి తగు సూ చనలు అందించారు. రుద్రూర్ కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అంజయ్య మాట్లాడుతూ ప్రణాళిక రూపొందించుకుని రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పని చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వాజీద్ హుస్సేన్ , బెల్లంపల్లి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శివకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక జాయింట్ డైరెక్టర్ జగన్నాథ చారి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, శాసీ్త్రయ సలహా మండలి సభ్యు లు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment