ఆర్‌వోబీ పైనుంచి రాకపోకలు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పైనుంచి మంగళవారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి, గోవింద్‌పేట్, మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామాల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ వద్ద చేపట్టిన ఆర్‌వోబీ పనులు రెండు సంవత్సరాల క్రితం పూర్తికాగా, మామిడిపల్లి వద్ద పనులు నత్తనడకన సాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు సంవత్సరాలుగా వాహనాలను దారి మళ్లించడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాదారులు గోవింద్‌పేట్ మీదుగా వెళ్లాల్సి వచ్చింది. ఎట్టకేలకు పనులు పూర్తి కావడంతో మామిడిపల్లి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి లేని అడ్మిషన్లపై చర్యలు తప్పవు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే పాఠశాలలను మూసివేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు అనుమతి లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని, పాఠశాలల అనుమతులు కూడా పొందడం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే ఇలాంటి పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అడ్మిషన్లు తీసుకునే ముందు పాఠశాలల వివరాలను తెలుసుకోవాలన్నారు.
ప్రజావాణిని వినియోగించుకోవాలి
సుభాష్‌నగర్: విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్ ఒక ప్రకటనలో కోరారు. వినియోగదారుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు 2024 జూన్ 17 నుంచి ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణిని అన్ని సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామన్నారు. వినియోగదారుల విద్యుత్ బిల్లులు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు కేటగిరి మార్పు, పేరు మార్పు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు తదితర సమస్యలను తీవ్రత ఆధారంగా పరిష్కరించడానికి ప్రజావాణి దోహదపడుతుందని ేతెలిపారు. విద్యుత్ ప్రజావాణికి ఇప్పటివరకు 614 ఫిర్యాదులు అందగా, 469 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.
పోలింగ్ సామగ్రికి
నష్టం వాటిల్లొద్దు
నిజామాబాద్ అర్బన్: ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లతోపాటు ఇతర పోలింగ్ సామగ్రికి నష్టం వాటిల్లకుండా పూర్తిస్థాయిలో సదుపాయాలున్న గోదాముల్లో భద్రపర్చాలని కలెక్ట ర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అవసరమైతే చెదల నివారణ కోసం పెస్ట్ కంట్రోల్ చేయించాలన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోదామును అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదా ము సీల్‌ను తెరిచారు. ఎన్నికల సామగ్రి భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించా రు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజేందర్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఆర్‌వోబీ పైనుంచి రాకపోకలు
Comments
Please login to add a commentAdd a comment