
ఒత్తిడి వద్దు..పదిని జయించు
మదనపల్లె సిటీ : వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయాన విద్యార్థుల్లో భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ఎక్కువ మార్కులు సాధించాలని, మంచి ర్యాంకు రావాలని తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ తరుణంలో మోదీ మాటలను ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. జిల్లాలో గత ఏడాది మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విలువైన జీవితాన్ని కోల్పోయారు. పది మార్కులే జీవితం కాదన్న సత్యాన్ని అంతా గ్రహించాలి. ఇంకా వారం రోజులు సమయం ఉందని, ఒత్తిడికి లోను కావద్దని, పక్కా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు, ర్యాంకు సాధించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం పాఠశాలలో రాసే పరీక్షల వంటివే అన్న భావనతో సిద్ధమవ్వాలని చెబుతున్నారు.
ఏం చేయాలంటే..
సమయానికి ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తినాలి. పరీక్ష వేళ ఒత్తిడికి గురికాకుండా తగిన నిద్ర అవసరం. అన్ని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించుకుని చదువుకోవాలి. కష్టమైన సబ్జెక్టుని ఇష్టంగా చదువుకోవాలి. బృందపఠనం అవసరం. ఏకాగ్రత కోసం ఉదయాన్నే ధ్యానం వంటి సాధనలు చేయాలి. అనుమానాలను ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలి.
పక్కా ప్రణాళకతో చదవాలి
నిపుణుల సూచన
Comments
Please login to add a commentAdd a comment