
ఖాళీ బిందెలతో నిరసన
సాక్షి రాయచోటి : జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. వేసవి తాపం భయపెడుతుండగా ప్రజలు తీరని దాహంతో అల్లాడిపోతున్నారు. జిల్లాకేంద్రమైన రాయచోటిలో ఇప్పటికే ప్రజలు మంచినీరో రామచంద్రా...అంటున్నారు. అనేక కాలనీల్లో నీరు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయి. భూగర్బ జలాలు అడుగంటడం ప్రారంభమైన నేపథ్యంలో చెరువులు, కుంటల్లో ఉన్న నీరు ఇంకిపోతే బోర్లలో కూడా కనీస నీటిమట్టం గగనమవుతుంది. ఇప్పటికే తాగునీటి బోర్లలో రోజురోజుకు నీరు ఇంకిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రానున్న కాలంలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఆశాజనకంగా వర్షాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నా ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం కానుందని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను ముందే అంచనా వేసి ఈ పాటికే నివారణ చర్యలు చేపట్టి ఉంటే ప్రజలకు తాగునీటి కష్టాలు కొంతవరకై నా తప్పేవి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్, ప్రచార పటాటోపాలపై ఉన్న ఆసక్తి ప్రజల పట్ల లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
రాయచోటి మున్సిపాలిటీలో
దాహం...దాహం
జిల్లా కేంద్రమైన రాయ చోటిలో ప్రజల నుంచి దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రా యచోటిలోని పలు కాల నీలకు సంబంధించి నీటి కోసం వారం రోజులు పడుతోంది. అంతేకాకుండా కొనుగోలు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రధానంగా వెలిగల్లు ప్రాజెక్టుకు సంబంధించి రెండో పైపులైన్ పనులు నిలిచిపోవడంతో రాయచోటికి తాగునీటికి ఇబ్బందులు ఎ దురవుతున్నాయి. అంతో, ఇంతో నీరు లభిస్తున్నా పూ ర్తి స్థాయిలో రెండో పైపులైన్ ఉంటేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించేందుకు అవకాశం ఉంటుంది.
8గ్రామాలను తాకుతున్న
తాగునీటి సమస్య
పట్టణాల్లోని శివారు ప్రాంతాలే కాకుండా గ్రామాలను తాగునీటి ఎద్దడి తాకింది. నందలూరు మండలంలోని ఎస్టీ కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడో పొలాల వద్దకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో రానున్నరోజుల్లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే స్కీముల్లోని బోర్లు కూడా ఎండ సెగ తగిలి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఏది ఏమైనా ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడడం అధికారులకు తలకుమించిన భారంగా మారనుంది.
ఇప్పటికే రాయచోటిలో దాహం కేకలు
పల్లెల్లో సైతం మోగుతున్న తాగునీటి సైరన్
ఎండిపోతున్న సీజనల్ బోర్లు
జిల్లాలో వేసవి కాలం వచ్చిందంటే సీజనల్ బోర్లు ఎండిపోతున్నాయి. కేవలం వర్షాకాలం, ఇతర సీజన్లలో నీరు ఉన్నప్పుడు మాత్రమే బోర్లు పనిచేస్తున్నాయి. వేసవి ప్రారంభమైందంటే భూగర్బ జలాలు అడుగంటి సీజనల్ బోర్లు పనికుండా ఉన్నాయి. 10 సీపీడబ్ల్యూ, 4896 పీడబ్ల్యూఎస్ స్కీములు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8946 బోర్లు ఉండగా, అందులో 2980 సీజనర్ బోర్లు ఎండిపోయాయి.
సమస్య తలెత్తకుండా చర్యలు
జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎక్కడెక్కడా ప్రమాదం ఉంటుందన్న విషయం తెలుసుకుని పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాం. వేసవి నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో కొంత నీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడనుంది. అందుకు అనుగుణంగా పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నాం.
– ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఆర్‌డబ్ల్యూఎస్, రాయచోటి, అన్నమయ్య జిల్లా
సిద్దవటం : మండలంలోని వెంకటేశ్వరపురం, మాధవరం–1 గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు సోమవారం ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వెంకటేశ్వరపురంలోని ప్రజలకు 2 వారాలకు ఒక సారి తాగునీరు వస్తోందని, అవికూడా 3,4 బిందెలు మాత్రమే వస్తున్నాయన్నారు. తాము రోడ్డు అవతలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు. మరికొందరు ఒకక్యాన్ రూ. 10 చెల్లించి తాగుతున్నామని వాపోయారు. తాగునీరు రావడం లేదని సర్పంచ్‌ను అడిగితే 2నెలల వరకు రావంటాడు, మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలన్నారు. మాధవరం–1 గ్రామ ప్రజలు తాగునీరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటి కోసం కొళాయిల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఖాళీ బిందెలతో నిరసన

ఖాళీ బిందెలతో నిరసన

ఖాళీ బిందెలతో నిరసన

ఖాళీ బిందెలతో నిరసన
Comments
Please login to add a commentAdd a comment