ఒత్తిడికి లోనుకావొద్దు : డీఈఓ సుబ్రమణ్యం
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాశాఖ అఽధికారి సుబ్రమణ్యం తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో 22,355 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 121 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1200 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆరు సమస్మాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. హాల్‌టిక్కెట్లను వాట్సప్ మనమిత్ర 9552300009 నంబర్ల నుంచి పొందవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment