అర్జీలకు సత్వరమే పరిస్కారం
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజిఆర్‌ఎస్ హాల్‌లో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మధుసూదన్ రావు, ఎస్‌డీసీ రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు
ఆన్‌లైన్ ద్వారా శిక్షణ
కడప రూరల్ : మెగా డీఎస్సీ పరీక్షలకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ జిల్లా సంచాలకులు యం భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ) కేటగిరీకి చెందిన అభ్యర్ధులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు టెట్ పరీక్షలో అర్హత సాధించిన మార్కుల జాబితా నేటివిటీ, కుల, ఆదాయం ధృవీకరణ పత్రాలతో రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి కడప పాత రిమ్స్‌లో గల ఏపీ బీసీ స్టడీ సర్కిల్, బీసీ భవన్ రెండో అంతస్తులోని కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో లేదా 9849919221 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment