
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో బినామీ సీఎం రమేశ్‌పై ఐటీ సోదాల్లో దోపిడీ వ్యవహారాలన్నీ బయటపడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. పుట్టుకతోనే వేల కోట్ల సంపన్నుడని బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు కోర్టుకెళ్లి ఐటీ అధికారుల అంతుతేలుస్తానని వార్నింగ్ ఇస్తున్నాడని సీఎం రమేశ్‌పై నిప్పులు చెరిగారు.
చంద్రబాబు ట్రైనింగ్ ఇలాగే ఉంటుందని ధ్వజమెత్తారు. సీఎం రమేశ్ సంస్థలపై ఐటీ అధికారుల దాడుల వార్తల కంటే డెకాయిట్ల వివరణనే కొన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ఇచ్చి స్వామి భక్తిని ప్రదర్శించుకున్నాయని విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 28, 2018
Comments
Please login to add a commentAdd a comment