సీఎం రమేశ్ ఇళ్ల పై ఐటీ దాడులు | IT officials raid Andhra Pradesh TDP lawmaker CM Ramesh's homes | Sakshi
Sakshi News home page

సీఎం రమేశ్ ఇళ్ల పై ఐటీ దాడులు

Published Fri, Oct 12 2018 9:58 AM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM

టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడలో ఏకకాలం‍లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement