సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు చంద్రబాబు సర్కారు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసినట్టు వెల్లడించాయి. హంద్రీనీవా 2వ ప్యాకేజీలో రూ.42 కోట్లకుగాను మిగిలిపోయిన పనులు రూ.9 కోట్లు అయితే, దాన్ని మళ్లీ రూ.52 కోట్లకు రీ టెండర్ వేసి సీఎం రమేష్‌కు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. దాన్నికూడా భారీగా పెంచి సీఎం రమేష్ దాదాపు రూ.90 కోట్ల బిల్లులు తీసుకున్నట్టు తెలుస్తోంది. హంద్రీ నీవాలో 36వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.55 కోట్లకుగాను దీన్ని రూ.265 కోట్లకు పెంచి చేజిక్కించుకున్నారని సమాచారం.