
సాక్షి, న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఘాటుగా స్పందించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఎంపీ కేశినేని నానిని ఉద్దేశిస్తూ పరోక్షంగా మండిపడ్డారు. ‘నాపై అసందర్భంగా, సత్యదూరమైన ఆరోపణలు.. కల్పితాలు ప్రచారం చేయడం మాని తమ కుటుంబ వ్యవహారాలు, వాళ్ల పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నాను. ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు, ఆధారాలు అవసరం లేదు’ అని సీఎం రమేష్ తన ట్వీట్‌లో వెల్లడించారు.
చదవండి: (BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సంచలన నిర్ణయం!)