
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత రావి వెంకటరమణ ప్రశ్నించారు. శనివారం ఆయన కిలారి రోశయ్య, చంద్రగిరి ఏసురత్నంలతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచుకున్నారు కాబట్టే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. సీఎం రమేశ్, బీద మస్తాన్‌రావు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
బీజేపీతో నాలుగేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడులను అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లేనన్నారు. ప్రభుత్వ సొమ్ము దోచుకున్న బడాబాబుల వెనుక ఎవరున్నారో తెలియాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన వ్యక్తులపై దాడులు జరుగుతుంటే అవి ఆంధ్రులపై జరుగుతున్న దాడులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని జనం అర్థం చేసుకుంటారని, త్వరలోనే తగిన బుద్ది చెబుతారని వెంకటరమణ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment