ravi venkata ramana
-
‘టీడీపీ నేతలకు భయమెందుకు’
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత రావి వెంకటరమణ ప్రశ్నించారు. శనివారం ఆయన కిలారి రోశయ్య, చంద్రగిరి ఏసురత్నంలతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచుకున్నారు కాబట్టే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. సీఎం రమేశ్, బీద మస్తాన్‌రావు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీతో నాలుగేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడులను అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లేనన్నారు. ప్రభుత్వ సొమ్ము దోచుకున్న బడాబాబుల వెనుక ఎవరున్నారో తెలియాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన వ్యక్తులపై దాడులు జరుగుతుంటే అవి ఆంధ్రులపై జరుగుతున్న దాడులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని జనం అర్థం చేసుకుంటారని, త్వరలోనే తగిన బుద్ది చెబుతారని వెంకటరమణ వ్యాఖ్యానించారు. -
'సీజ్ చేసిన మద్యంతో నాకు ఎలాంటి సంబంధం లేదు'
గుంటూరు: అధికారులు సీజ్ చేసిన మద్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పొన్నూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి రావి వెంకటరమణ తెలిపారు. ఏడాది క్రితమే తన ఫ్యాక్టరీని లీజ్ కు ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ వివరాలను ఎన్నికల నామినేషన్ సందర్భంగా కలెక్టర్ కు అందించామన్నారు. ఇప్పుడు తనపై వస్తున్న ఆరోపణలకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలన్నారు. -
'యామిని బాల నామినేషన్‌పై అభ్యంతరం'
అనంతపురం : అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థి యామిని బాల నామినేషన్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. యామిని బాల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారని ఆరోపణలు చేశారు. కాగా ఆర్వో రామ్మోహన్ ఆమె నామినేషన్ ఆమోదించటంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకట రమణ నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు. టీడీపీ నేతల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు.