అధికారులు తెరవాలనుకుంటున్న డిజిటల్ లాకర్‌లో కేవలం తన బట్టలు మాత్రమే ఉన్నాయని రమేష్ తెలిపారు. ఇంట్లో పనిచేసే నౌకర్ల వల్ల ఇబ్బందులు తలెత్తకూడదనే డిజిటల్ లాకర్ ఏర్పాటు చేసినట్టు రమేష్ చెప్పుకొచ్చారు. ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తానని తెలిపారు. ఐటీ అధికారులు తన భార్య పేరు మీద నోటీసులు ఇచ్చారని ఆయన వెల్లడించారు. గత నాలుగేళ్లలో 3 వందల కోట్ల రూపాయల టాక్స్ లు కట్టానని వెల్లడించారు. అవసరమనుకుంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పంచనామా కూడా కాపీ మీడియాకు ఇస్తానని అన్నారు.