సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇటీవల చోడవరంలో ఓ ఘటనలో కేసు నమోదు కాగా శనివారం నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కార్యకర్తలకు చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్ సీఐ క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకుని తీయడంతో సీఎం రమేష్ అధికారులపై చిందులు తొక్కారు. ఓటర్లుకు సింబల్ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. ఇవి తాయిలాలు కాదని అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రమేష్‌కు 41ఏ నోటీసులు జారీ..
అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్‌ఐ అధికారులపై దాడికి దిగడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో సీఎం రమేష్‌కు శనివారం రాత్రి పోటీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల తొమ్మిదో తేదీన విచారణను హాజరు కావాలని అనకాపల్లి ఎస్‌డీపీవో ఆదేశించారు. కాగా, ఐపీసీలోని 353,342,506,201,188, 143/rw, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా ఆరుగురి పేర్లను పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment