సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్)కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం రమేష్ మొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్, రెండోసారి నామినేట్ అయిన సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ దాడుల నేపథ్యంలో తన వ్యక్తిగత ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్, జూబ్లిహిల్స్‌లో తన నివాసానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజభవనాన్ని తలిపిస్తున్న ఆయన నివాసాన్ని చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేశ్ నివాసంలోని అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న హోంథియేటర్, స్విమ్మింగ్‌పూల్, డైనింగ్ టేబుల్, బెడ్ రూం ఫొటోలు వైరల్ అయ్యాయి.
చదవండి:
వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్....
రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
సీఎం రమేష్ సంస్థల్లో ఐటీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment