బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా 45వ చెస్ ఒలింపియాడ్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ మంచి మనసును చాటుకుంది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా చెక్ రిపబ్లిక్ గ్రాండ్‌మాస్టర్లు అద్భుతమైన క్రీడా స్పూర్తిని ప్రదర్శించి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు.
అసలేం ఏం జరిగిందంటే?
ఈ టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు గురువారం తమ రెండో రౌండ్ మ్యాచ్‌లో SYMA స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా చెక్ రిపబ్లిక్‌తో తలపడింది. అయితే తానియా సచ్‌దేవ్, హారిక ద్రోణవల్లి, వంటికా అగర్వాల్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత బృందం.. వేదిక వద్దకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది.
ట్రావిలింగ్‌లో సమస్యల కారణంగా రెండు బృందాలుగా వేదిక వద్దకు చేరుకున్నారు. టీమిండియాలోని కొంతమంది సభ్యులు వేదిక వద్దకు వచ్చిన వెంటనే టోర్నమెంట్ అధికారులు చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లను గడియారం(క్లాక్)ను ప్రారంభించాలని సూచించారు.
సరిగ్గా ఇదే సమయంలో చెక్ రిపబ్లిక్ జట్టు తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. భారత జట్టు మొత్తం సభ్యులందరూ వచ్చేవరకు తమ గడియారాలను ప్రారంభించకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సభ్యులందరూ వచ్చాక గేమ్ ప్రారంభమైంది. అయితే ఈ రెండో రౌండ్‌లో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చెక్ రిపబ్లిక్‌పై 3.5-05 తేడాతో విజయం సాధించారు.
చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు
Due to conveyance issues, the Indian women team arrived late. After some of the team members arrived and the arbiter asked to start the clocks, the Czech Republic players decided not to start the clocks and wait for their opponents. This is true sportsmanship! pic.twitter.com/0GbbWlNcrl
— ChessBase India (@ChessbaseIndia) September 12, 2024
Comments
Please login to add a commentAdd a comment