
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఏటీకే మోహన్ బగాన్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంత ప్రేక్షకుల మధ్య శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మోహన్‌బగాన్ 2–0 గోల్స్ తేడాతో ఒడిషా ఎఫ్‌సీపై ఘన విజయం సాధించింది. మోహన్‌బగాన్ తరఫున బోమన్ (36వ నిమిషం), డి.పెట్రాడోస్ (58వ నిమిషం) గోల్స్ సాధించారు.
తాజా విజయంతో 20 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 34 పాయింట్లు సాధించిన మోహన్‌బగాన్ నాలుగో జట్టుగా ఐఎస్‌ఎల్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో 10 విజయాలు సాధించిన టీమ్ 6 ఓడి మరో 4 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఈ ఫలితంతో సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీతో మోహన్‌బగాన్ ప్రత్యర్థిగా తలపడటం ఖాయమైంది.
సెమీఫైనల్ మ్యాచ్ రెండు అంచెలుగా జరుగుతుంది. ఇరు జట్ల మధ్య తొలి పోరు ఈ నెల 9న హైదరాబాద్, రెండో పోరు ఈ నెల 13న రెండో పోరు కోల్‌కతాలో జరుగుతుంది. మరో సెమీస్ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment