''అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్‌లు మరోసారి తలపడతాయన్నప్పుడు''.. ఇరుదేశాల అభిమానులు చాలా సంతోషపడ్డారు. మూడు వారాల వ్యవధిలోనే మరోసారి దాయాదులు తలపడడం నిజమైతే బాగుండనుకున్నారు. అయితే అది నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే దాయాది పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక పడాల్సింది మన అడుగే.
గురువారం(నవంబర్ 10న) ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో సెమీఫైనల్లో టీమిండియా గెలిచి ఫైనల్‌కు వెళ్లాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. మాములుగానే ఈ రెండు జట్లు ఎదురుపడితే ఆ మజా ఎలా ఉంటుందో సూపర్-12 దశలో చూశాం. ఒకవేళ టీమిండియా, పాకిస్తాన్‌లు మరోసారి ఫైనల్లో తలపడితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఇరుదేశాల అభిమానులు కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు.
సూపర్-12 దశలో వెళ్లిపోవాల్సిన స్థితి నుంచి నక్కతోక తొక్కి సెమీస్‌లో అడుగుపెట్టిన పాక్ కివీస్‌పై విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. ఇక గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా బలమైన ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కొనబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
కేఎల్ రాహుల్, కోహ్లి, సూర్యకుమార్‌లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం కాగా.. రోహిత్ ఫామ్ కలవరానికి గురి చేస్తుంది. బౌలింగ్ ప్రదర్శతో ఆకట్టుకుంటున్న హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ పదును చూపించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం టీమిండియానే ఫేవరెట్ అని చెప్పొచ్చు. అయితే ఇంగ్లండ్ కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. వారితో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తువంది. మార్క్‌వుడ్, డేవిడ్ మలాన్‌లు గాయాల బారిన పడడం కాస్త ఇబ్బంది కలిగించినప్పటికి మ్యాచ్ సమయానికి బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అంతే సంగతి. టి20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్ తలపడితే చూడాలనుకుంటున్న సగటు అభిమాని కోరిక నెరవారాలని దేవుడిని ప్రార్ధిస్తూ.. టీమిండియాకు ''ఆల్ ది బెస్ట్''.
Comments
Please login to add a commentAdd a comment