
తొలుత వరల్డ్ నంబర్ వన్‌పై గెలుపొందిన వినేశ్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ మరో సంచలన విజయం సాధించింది. మహిళల 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో స్వర్ణ పతక విజేత సుసాకేకు షాకిచ్చిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ క్రమంలో ఉక్రెయిన్ రెజ్లర్ లివాచ్‌తో తలపడ్డ వినేశ్ ఫొగట్.. శుభారంభం చేసింది. 4-0తో లీడ్‌లోకి వెళ్లింది. అయితే, లివాచ్ కూడా అంత తేలికగా తలొగ్గలేదు. ఈ క్రమంలో తన శక్తినంతటినీ ధారపోసిన వినేశ్ ఫొగట్.. ఆఖరికి లివాచ్‌ను 7-5తో ఓడించి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.
వినేశ్ ఫొగట్ తదుపరి క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నెలిస్ గుజ్‌మాన్ లోపెజ్‌తో సెమీ పోరులో తలపడనుంది. మంగళవారం రాత్రి 10.15 నిమిషాలకు ఈ బౌట్ ఆరంభం కానుంది.
కాగా వినేశ్ ఫొగట్ ప్రస్తుతం వరల్డ్ నంబర్ 65 ర్యాంకర్ కాగా.. వరుసగా వరల్డ్ నంబర్ వన్ సుసాకే, ఎనిమిదో సీడ్ లివాచ్‌లను ఓడించి... తన కెరీర్‌లో తొలిసారిగా ఒలింపిక్స్ సెమీస్‌కు చేరుకుంది. రియో 2016లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన వినేశ్.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లోనే ఓడిపోయి.. రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.
చదవండి: Olympics 2024: ఫైనల్లో నీరజ్ చోప్రా
Vinesh Phogat in control💪
The 🇮🇳 WRESTLER is closing on a semi-final spot in #Paris2024!#Cheer4Bharat & watch the Olympics LIVE on #Sports18 & stream FREE on #JioCinema📲#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/mNajPsKh2V— JioCinema (@JioCinema) August 6, 2024