
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీలో సగం మ్యాచ్‌లు ముగిశాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లతో కలిపి ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు పూర్తయ్యాయి.
కాగా ఇప్పటివరకు జరిగిన ఈ టోర్నీ మొదటి అర్ధబాగంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ వంటి పసికూనలు వరల్డ్‌క్లాస్ జట్లను మట్టికరిపించాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఆఫ్గానిస్తాన్ చిత్తుచేయగా.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించింది.
సెమీఫైనల్స్‌కు చేరేది ఎవరు?
ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత జట్టు పటిష్ట ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఇక పాయింట్ల పట్టికలో టీమిండియా తర్వాత దక్షిణాఫ్రికా ఉంది.
దక్షిణాఫ్రికా కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్.. నాలుగింట విజయం సాధించింది. ఇక మూడో స్ధానంలో కివీస్ ఉంది. కివీస్ కూడా టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతోంది. భారత్‌తో మినహా మిగితా మ్యాచ్‌లన్నింటిలోనూ బ్లాక్ క్యాప్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక కివీస్ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా ఉంది.
టోర్నీ ఆరంభంలో కాస్త తడబడిన ఆసీస్.. ఆ తర్వాత తిరిగి గాడిలో పడింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ అర్హత సాధిస్తాయి.
అయితే హాఫ్ స్టేజి ముగిసేటప్పటికి సెమీఫైనల్ చేరే జట్లపై ఇంకా సృష్టత రాలేదు. మరో రెండు మూడు రోజుల్లో సెమీఫైనల్ చేరే జట్లపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నవంబర్ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్.. నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
చదవండి: ఐపీఎల్ ఆడిన అనుభవం కలిసొచ్చింది.. అతడు మాత్రం అద్బుతం: సౌతాఫ్రికా కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment