బ్లూమ్‌ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్‌లో యువ భారత్ అజేయంగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన గ్రూప్–1 సూపర్ సిక్స్ పోరులో భారత్ 132 పరుగుల భారీ తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించడంతో సెమీస్ స్థానం ఖాయమైంది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.
62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ ఉదయ్ సహరన్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సచిన్ దాస్ (101 బంతుల్లో 116; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 215 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసింది. కెప్టెన్ దేవ్ ఖానల్ (53 బంతుల్లో 33; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs ENG: ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్
Comments
Please login to add a commentAdd a comment