
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్- పాక్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకొన్న పాక్‌ను టీమిండియా ముప్పతిప్పలు పెడుతుంది. భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును రక్షణాత్మక ధోరణిలో పడేశారు. పాక్ జట్టు 27 ఓవర్లలో 100 పరుగులను అందుకుందంటే భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. అంతకుముందు పాక్ ఓపెనర్ హైదర్ అలీ (56 పరుగులు, 9 ఫోర్ల)తో అర్థశతకం సాధించగా, మరో ఓపెనర్ మహ్మద్ హురైరా 4 పరుగుల వద్ద సుశాంత్ మిశ్రా బౌలింగ్‌లో సక్సేనాకు క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా, వన్‌డౌన్‌లో వచ్చిన ఫవాద్ మునీర్ 16 బంతులు ఆడి పరుగులు ఏం చేయకుండానే రవి బిష్ణోయ్ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన ఖాసీమ్ అక్రమ్ 9 పరుగుల వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ హారిస్‌తో కలిసి పాక్ కెప్టెన్ నాజిర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండో స్పెల్‌కు వచ్చిన అధర్వ అంకోలేకర్ బౌలింగ్‌లో 21 పరుగులు చేసిన మహ్మద్ హారిస్ వెనుదిరిగాడు. ప్రసుత్తం పాక్ జట్టు 39 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ రోహైల్ నాజిర్ 59 పరుగులు , తాహిర్ హుస్సేన్ 0పరుగుతో క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment