under 19 wordl cup
-
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ కు నిరాశ
-
పాక్ పనిపడుతున్న టీమిండియా బౌలర్లు
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్- పాక్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకొన్న పాక్‌ను టీమిండియా ముప్పతిప్పలు పెడుతుంది. భారత బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టుదిట్టమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి జట్టును రక్షణాత్మక ధోరణిలో పడేశారు. పాక్ జట్టు 27 ఓవర్లలో 100 పరుగులను అందుకుందంటే భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. అంతకుముందు పాక్ ఓపెనర్ హైదర్ అలీ (56 పరుగులు, 9 ఫోర్ల)తో అర్థశతకం సాధించగా, మరో ఓపెనర్ మహ్మద్ హురైరా 4 పరుగుల వద్ద సుశాంత్ మిశ్రా బౌలింగ్‌లో సక్సేనాకు క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా, వన్‌డౌన్‌లో వచ్చిన ఫవాద్ మునీర్ 16 బంతులు ఆడి పరుగులు ఏం చేయకుండానే రవి బిష్ణోయ్ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన ఖాసీమ్ అక్రమ్ 9 పరుగుల వద్ద రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ హారిస్‌తో కలిసి పాక్ కెప్టెన్ నాజిర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండో స్పెల్‌కు వచ్చిన అధర్వ అంకోలేకర్ బౌలింగ్‌లో 21 పరుగులు చేసిన మహ్మద్ హారిస్ వెనుదిరిగాడు. ప్రసుత్తం పాక్ జట్టు 39 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ రోహైల్ నాజిర్ 59 పరుగులు , తాహిర్ హుస్సేన్ 0పరుగుతో క్రీజులో ఉన్నారు. -
ద్రవిడ్ మాట మన్నించారు
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం, విజయవంతమైన జూనియర్ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. అండర్–19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ద్రవిడ్‌తో పాటు బృంద సభ్యులందరికీ రూ. 25 లక్షల చొప్పున నజరానా అందిస్తామని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. కప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ (బెంగళూరు)లో జట్టు సన్నాహాల్లో పాల్గొన్న సహాయ సిబ్బందికి కూడా నజరానా అందనుంది. మొదటి నజరానా జాబితాలో ఉన్న పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), అభయ్ శర్మ (ఫీల్డింగ్ కోచ్), యోగేశ్ పార్మర్ (ఫిజియోథెరపిస్ట్), ఆనంద్ దతే (ట్రెయినర్), మంగేశ్ గైక్వాడ్ (మసాజ్), దేవ్‌రాజ్ రౌత్ (వీడియో అనలిస్ట్)లతో పాటు స్వదేశంలోని సన్నాహాల్లో పాలుపంచుకున్న మరో ఐదుగురు డబ్ల్యూవీ రామన్ (కోచ్), మనుజ్ శర్మ, సుమిత్ మలహపుర్కర్ (లాజిస్టిక్స్ మేనేజర్స్), అమోఘ్ పండిట్ (ట్రెయినర్), రాజేశ్ సావంత్ (దివంగత ట్రెయినర్)లకు బోర్డు బెనిఫిట్స్ దక్కనున్నాయి. ద్రవిడ్‌కు సగం నజరానా (రూ.25 లక్షలు) తగ్గినా అతను కోరుకున్న సమానత్వం మాత్రం దక్కింది. ఔరా... ద్రవిడ్ ఔదార్యం పృథ్వీ షా నేతృత్వంలోని కుర్రాళ్ల జట్టు ఒక్క మ్యాచ్ (ఫైనల్)తో అండర్–19 ప్రపంచకప్ గెలిచింది. కానీ ఆ ఒక్క విజయం కోసం ద్రవిడ్ సారథ్యంలోని కోచింగ్ బృందం ఓ ఏడాదికిపైగా విశేష కృషి చేసింది. ఈ బృంద సభ్యుల్లో కొందరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందిస్తే, ఇంకొందరు న్యూజిలాండ్ (ఆతిథ్య దేశం)కు జట్టుతో పాటు వెళ్లి చెమటోడ్చారు. అయితే బీసీసీఐ మొదట కివీస్ వెళ్లిన కోచింగ్ బృందానికే నజరానా ప్రకటించగా... టీమ్ ట్రెయినర్ రాజేశ్ సావంత్ గతేడాది మరణించారు. రాజేశ్ కూడా యువ జట్టును తీర్చిదిద్దిన రాహుల్ అండ్ కో సభ్యుడు. దీంతో అతనికి ప్రోత్సాహకం అందాలని ద్రవిడ్ గట్టిగా కృషిచేశాడు. ఇప్పుడు బోర్డు అతని కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడింది. అందినకాడికి వచ్చిన దాంతో తన ఇంటిని మాత్రమే చక్కబెట్టుకునే వాళ్లున్న ఈ రోజుల్లో అందరికి పేరు, ప్రోత్సాహం రావాలన్న ద్రవిడ్ నిజంగా గ్రేట్... గ్రేటెస్ట్ కదా! -
జూనియర్లు కావాలిక సీనియర్లు
ముంబై: ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ విజేతలుగా నిలిచే అర్హత తమ కుర్రాళ్లకే ఉందని భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. టోర్నీ మధ్యలో ఐపీఎల్ వేలం కాస్త ఇబ్బందికరమైనా... కుర్రాళ్లు ఆ ఛాయలు కనిపించకుండా తొందరగానే బయటపడ్డారని చెప్పారు. క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఫైనల్లో నంబర్‌వన్ ఆట ఆడలేదన్నారు. అయితే గత ఏడాదిన్నర నుంచి జట్టు సన్నద్ధమైన తీరు అద్భుతమని కితాబిచ్చారు. ప్రణాళికతో సిద్ధమైన యువ జట్టు ఆటలో పక్కా ప్రణాళికతోనే ఒక్కో మ్యాచ్‌ను గెలిచిందని, చివరకు కప్ కూడా సాధించడం గర్వంగా ఉందని అన్నారు. ‘టీమ్ వర్క్‌తోనే విజయవంతమయ్యాం. ఎన్సీఏలో శిబిరాలు, బీసీసీఐ ఏర్పాటు చేసిన మ్యాచ్‌లు, సిరీస్‌లు అన్నీ టైటిల్ గెలిచేందుకు దోహదపడ్డాయి. కుర్రాళ్లు ఈ విజయంతో ఆగిపోవద్దు. ఇక అండర్–23, సీనియర్ టీమిండియా లక్ష్యంగా వారందరూ కష్టపడాలి’ అని ద్రవిడ్ చెప్పారు. వారి కృషి ఫలితమే... యువ సేనను చాంపియన్లుగా చేసేందుకు కోచ్ ద్రవిడ్ అండ్ కో ఎంతో చెమటోడ్చిందని భారత అండర్–19 సారథి పృథ్వీ షా అన్నాడు. ప్రపంచకప్‌లో తాను ధరించిన జెర్సీ నంబర్ 100పై ఎలాంటి మూఢవిశ్వాసం లేదన్నాడు. నాలుగో ప్రపంచకప్ సాధించిన యువ భారత జట్టు సోమవారం స్వదేశానికి చేరుకుంది. ఇక్కడి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కుర్రాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఉన్నతాధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం కెప్టెన్ పృథ్వీ షా మీడియాతో మాట్లాడుతూ ‘వరల్డ్‌కప్‌లో మాకు ఎన్నో మధురానుభూతులున్నాయి. వాటిని మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా నేనైతే ప్రపంచకప్‌లో విజయవంతమైన సారథిగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని అన్నాడు. గత రెండు, మూడేళ్లుగా తానెంతో కష్టపడ్డానని షా చెప్పాడు. రంజీ, దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే సెంచరీలు బాదిన పృథ్వీ షా ఇదంతా అనుభవంతోనే సాధ్యపడిందన్నాడు. ‘ఏడెనిమిదేళ్ల వయసులో స్కూల్ క్రికెట్‌ను ఆరంభిస్తాం. పాఠశాల కోచ్‌ల నుంచి ప్రస్తుత కోచ్ ద్రవిడ్ వరకు అందరితోనూ ఎంతో నేర్చుకున్నాను. వాళ్ల అనుభవం, మార్గదర్శనంతోనే నా ఆట మెరుగైంది. ఎన్ని జట్లకు ఆడినా... భారత్‌కు ఆడిన అనుభూతే వేరు. అదెంతో అనిర్వచనీయమైంది’ అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. తానీ స్థాయికి ఎదగడానికి తన తండ్రి ప్రోత్సాహం ఉందన్నాడు. ఆట నేర్చుకోవడం నుంచి మ్యాచ్‌లు ఆడటం వరకు నన్ను ఎంత దూరమైనా తీసుకెళ్లేవాడని చెప్పాడు. -
వినూత్నంగా వివాహం
చామరాజనగర (బొమ్మనహళ్లి) : క్రికెట్‌పై ఉన్న అభిమానంతో ఓ జంట భారతీయ జెండా చేతపట్టుకుని, బాసింగాలకు బదులు జాతీయ జెండా రిబ్బన్లు కట్టుకుని బంధువుల సమక్షంలో శనివారం ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడి చామరాజనగర భ్రమరాంబ కళ్యాణమంటపంలో శనివారం ఉదయం కార్తీక్, శ్వేతల పెళ్లికి పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇద్దరికి క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. పెళ్లి తంతు జరుగుతుండగా భారత్ అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకున్న సమాచారం తెలుసుకున్న వధూవరులు పెళ్లి వేదికపై అప్పటికప్పుడు భారత్ అండర్–19 జట్టు సభ్యుల ఫ్లెక్సీని తెప్పించి తలకు బాసింగాలకు బదులు జాతీయ జెండా రిబ్బన్లు కట్టుకుని అందరి సమక్షంలో కార్తీక్, శ్వేతలు వివాహం చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులు ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. క్రికెట్ పిచ్చి అంటే ఇదే మరి అంటూ పెళ్లి భోజనం ఆరగించి దీవించి వెళ్లిపోయారు. -
యువ టీమిండియాకు సచిన్ అభినందనలు
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
మౌంట్‌మాంగనీ : భారత్‌తో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా రికార్డు స్థాయిలో నాలుగోసారి కప్‌ను సొంతం చేసుకున్నట్లవుతుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది. మరోవైపు ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందుకు తగ్గట్లే ఆడుతూ వచ్చింది. పెద్దగా పోరాడాల్సిన అవసరం లేకుండానే లీగ్, క్వార్టర్స్, సెమీస్‌లో అలవోకగా గెలుపొందింది. ఇదే ఊపు టైటిల్ పోరులోనూ చూపితే తిరుగుండదు. కానీ... ఆసీస్ వంటి జట్టు ఏ స్థాయి క్రికెట్లోనైనా ప్రమాదకరమే. అయినప్పటికీ కుర్రాళ్లు ఒత్తిడిని దరి చేరనీయకుండా ఆడితే ప్రత్యర్థిని మట్టి కరిపించవచ్చు. ముఖ్యంగా 2016 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో అనూహ్య పరాజయాన్ని గుర్తుపెట్టుకొని ఆడాలి. జట్లు (అంచనా) భారత్: పృథ్వీ షా (కెప్టెన్), మన్జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, హార్విక్ దేశాయ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, అనుకూల్ రాయ్, కమలేశ్ నాగర్కోటి, శివం మావి, ఇషాన్ పోరెల్, శివసింగ్. ఆస్ట్రేలియా: జాసన్ సంఘా (కెప్టెన్), జాక్ ఎడ్వర్డ్స్, మ్యాక్స్ బ్రయాంట్, పరమ్ ఉప్పల్, మెక్ స్వీనీ, జొనాథన్ మెర్లో, విల్ సదర్లాండ్, బాక్ట్స్ర్ హోల్ట్, జాక్ ఎవాన్స్, ర్యాన్ హ్యాడ్లీ, పోప్. -
పాకిస్తాన్‌కు మూడో స్థానం
క్వీన్స్టౌన్: అండర్–19 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు మూడో స్థానంతో సంతృప్తి పడింది. సెమీస్‌లో ఓడిన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడో స్థానం కోసం గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో గ్రూప్ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ మూడో స్థానంలో, అఫ్గానిస్తాన్ నాలుగో స్థానంలో నిలిచాయి. అండర్–19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2014లో ఆ జట్టు అత్యుత్తమంగా ఏడో స్థానం సంపాదించింది. -
శుభ్‌మాన్ శతకం: పాక్ టార్గెట్ 273
అండర్ 19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ పాక్‌స్థాన్‌కు 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీ షా, మన్జోత్ కల్రాలు తొలి వికెట్ కోల్పోయే సమయానికి 89 పరుగులు చేశారు. శుభ్‌మన్ గిల్ 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పృథ్వీ షా 41, కల్రా 47, శుభ్‌మన్ గిల్ 102 పరుగులు చేశారు. 50 ఓవర్లలో భారత్ 9 వికెట్టు కోల్పోయి 272 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు మహమ్మద్ ముసా 4 వికెట్లు, అర్షద్ ఇక్బాల్ 3 వికెట్లు తీశారు. -
కుర్రాళ్లకు ఇదో సవాల్!
ముంబై: అండర్–19 ప్రపంచకప్‌కు భారత జట్టును సన్నద్ధం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ సేనలోని కుర్రాళ్లను త్వరలోనే భారత్ ‘ఎ’జట్టులో చూడాలనుకుంటున్నారు. న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే ఈ జూనియర్ ప్రపంచకప్ కోసం భారత అండర్–19 జట్టు గురువారం ఉదయం బయల్దేరనుంది. ఈ సందర్భంగా కోచ్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఎంపికైన కుర్రాళ్లెవరికీ కివీస్‌లో ఆడిన అనుభవమే లేదు. దీంతో ఈ ప్రపంచకప్ వాళ్లకు పెద్ద చాలెంజ్. అక్కడ రాణిస్తే తిరుగుండదు. బహుశా వచ్చే 6–8 నెలల్లో భారత్ ‘ఎ’ జట్టుకు ఆడినా ఆడవచ్చు. వాళ్లకది గొప్ప ఘనత అవుతుంది. ఆపై సీనియర్ జట్టుకూ ఎంపిక కావచ్చు’ అని అన్నారు. అయితే వీళ్లలో ఎవరు మేటి ఆటగాళ్లవుతారు? ఎవరు జాతీయ జట్టులోకి ఎంపికవుతారని చెప్పడం తగదన్నారు. ఈ యువ జట్టు కెప్టెన్ పృథ్వీ షా ఇప్పటికే భారత్ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడాడు. ‘భారత ‘ఎ’, అండర్–19 జట్ల కోచ్‌గా నేనెంతో నేర్చుకున్నాను. ఈ తరం కుర్రాళ్లది పూర్తిగా భిన్నమైన నేపథ్యం. వాళ్ల ఆలోచనలు కూడా భిన్నమే. మూడు ఫార్మాట్లను ఆకళింపు చేసుకోగలరు. నిజంగా ఇది పెను సవాల్. ఎందుకంటే ఇప్పుడు ఆట ఎంతో మారింది’ అని ద్రవిడ్ అన్నారు. వచ్చే నెల 13 నుంచి కివీస్‌లో జరిగే మెగా ఈవెంట్లో పృథ్వీ షా సేన చక్కగా రాణిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముందుగా కివీస్ పరిస్థితులకు అలవాటు పడాలన్నారు. బెంగళూరులో నిర్వహించిన శిబిరంలో అలాంటి వాతావరణం కల్పించినప్పటికీ భౌగోళిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. కెప్టెన్ పృథ్వీ షా మాట్లాడుతూ ‘సారథిగా నాకు ఇది సువర్ణావకాశం. అంచనాలకు అనుగుణంగా జట్టును నడిపిస్తాను. ప్రతి ఆటగాడికి తమ వంతు బాధ్యత తెలుసు. భారత్‌ను విజేతగా నిలిపేందుకు వారం తా కష్టపడతారు’ అని అన్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లతో స్థానిక వాతావరణానికి అలవాటు పడతామని చెప్పాడు. అండర్–19 మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు ప్రస్తుత టోర్నీలో ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యుగినియా జట్లతో కలిసి గ్రూప్ ‘బి’లో ఉంది. మరోవైపు సీనియర్ జట్టు కెప్టెన్ కోహ్లి అండర్–19 ఆటగాళ్లతో ప్రత్యే కంగా ముచ్చటించి వాళ్లలో స్ఫూర్తి నింపాడు. -
విండీస్ కు అలా కలిసొచ్చింది!
మిర్పూర్: అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ ఆడిన ఒక కీలక మ్యాచ్‌లో వినిపించిన పేరు మన్కడింగ్. ఇదొక రకమైన రనౌట్. ఓ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆటగాడు క్రీజ్ దాటి బయటకు వెళ్లినప్పుడు బౌలర్ అవుట్ చేసే విధానాన్నే మన్కడింగ్ అంటారు. క్రీడా స్ఫూర్తికి కాస్త విరుద్ధంగా కనిపించినా నిబంధనల ప్రకారం దీన్ని కూడా అవుట్ గానే ప్రకటిస్తారు. అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టును అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేర్చిన మన్కడింగే ఇప్పుడు సందర్భమైంది. గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే-విండీస్ ల మధ్య పోరులో ఎవరు నెగ్గితే వారు క్వార్టర్స్‌కు చేరతారు. అయితే 227 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చివరి ఓవర్లో విజయానికి మూడు పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే చివరి ఓవర్ తొలి బంతికే విండీస్ బౌలర్ కీమో పాల్ నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ మటిగిమును మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. మటిగిము బ్యాట్ క్రీజులో కాకుండా లైన్ పైన ఉండడంతో మూడో అంపైర్ కూడా నిబంధనల ప్రకారం అవుట్‌గా ప్రకటించారు. దీంతో విండీస్ అనూహ్యంగా క్వార్టర్స్ కు చేరింది. ఇక ఆ తరువాత వారి ప్రయాణం వరల్డ్ కప్ సాధించే వరకూ సాగింది. క్వార్టర్స్ లో పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విండీస్.. ఆ తరువాత సెమీ ఫైనల్లో ఆతిథ్య బంగ్లాదేశ్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరింది. ఇక భారత్‌తో అమీతుమీ పోరులో విండీస్‌కు ఎదురేలేకుండా పోయింది. తొలుత భారత్ ను 45.1 ఓవర్లలో 145 పరుగులకు కట్టడి చేసిన విండీస్ .. ఆ తరువాత బ్యాటింగ్ లో కూడా ఫర్వాలేదనిపించి ఐదు వికెట్లు కోల్పోయి తొలిసారి వరల్డ్ కప్ ను అందుకుంది. 1947లో భారత్-ఆస్ట్రేలియాల టెస్టు మ్యాచ్ లో మన్కడింగ్ తొలిసారి జరిగింది. ఆసీస్ ఆటగాడు బిల్ బ్రౌన్ ను భారత బౌలర్ వినో మన్కడ్ ఇలా అవుట్ చేసి తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. ఇలా స్థిరపడిందే మన్కడింగ్. ప్రస్తుత అండర్-19 వరల్డ్ కప్ ను విండీస్ చేజిక్కించుకోవడానికి మన్కడింగ్ ఎంతో కొంత సాయ పడిందనే చెప్పాలి. ఇక్కడ విండీస్ పోరాట పటిమను తక్కువ చేయకపోయినా, వారికి అదృష్టం ఇలా కలిసొచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
సెమీస్‌కు చేరిన వెస్టిండీస్
ఢాకా: అండర్ -19 క్రికెట్ వరల్డ్‌కప్ లో వెస్టిండీస్ సెమీ ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్‌తో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో విండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. కెప్టెన్ హెట్‌మైర్(52), ఇమ్లాచ్(54)లు హాఫ్ సెంచరీలతో రాణించి విండీస్‌ను సెమీస్‌కు చేర్చారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 227 పరుగులు నమోదు చేసింది. పాకిస్తాన్ జట్టులో ఉమైర్ మస్జూద్(113),సల్మాన్ ఫయజ్(58 నాటౌట్) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 40.0 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని సెమీస్ కు చేరింది. దీంతో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్ భారత్-శ్రీలంకల మధ్య , రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగనున్నాయి.