మౌంట్‌మాంగనీ : భారత్‌తో జరుగుతున్న అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా రికార్డు స్థాయిలో నాలుగోసారి కప్‌ను సొంతం చేసుకున్నట్లవుతుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది. మరోవైపు ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందుకు తగ్గట్లే ఆడుతూ వచ్చింది. పెద్దగా పోరాడాల్సిన అవసరం లేకుండానే లీగ్, క్వార్టర్స్, సెమీస్‌లో అలవోకగా గెలుపొందింది. ఇదే ఊపు టైటిల్ పోరులోనూ చూపితే తిరుగుండదు. కానీ... ఆసీస్ వంటి జట్టు ఏ స్థాయి క్రికెట్‌లోనైనా ప్రమాదకరమే. అయినప్పటికీ కుర్రాళ్లు ఒత్తిడిని దరి చేరనీయకుండా ఆడితే ప్రత్యర్థిని మట్టి కరిపించవచ్చు. ముఖ్యంగా 2016 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో అనూహ్య పరాజయాన్ని గుర్తుపెట్టుకొని ఆడాలి.
జట్లు (అంచనా)
భారత్: పృథ్వీ షా (కెప్టెన్), మన్‌జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, హార్విక్ దేశాయ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, అనుకూల్ రాయ్, కమలేశ్ నాగర్‌కోటి, శివం మావి, ఇషాన్ పోరెల్, శివసింగ్.
ఆస్ట్రేలియా: జాసన్ సంఘా (కెప్టెన్), జాక్ ఎడ్వర్డ్స్, మ్యాక్స్ బ్రయాంట్, పరమ్ ఉప్పల్, మెక్ స్వీనీ, జొనాథన్ మెర్లో, విల్ సదర్లాండ్, బాక్ట్స్‌ర్ హోల్ట్, జాక్ ఎవాన్స్, ర్యాన్ హ్యాడ్లీ, పోప్.
Comments
Please login to add a commentAdd a comment