ICC Mens T20 World Cup 2022 - India Vs England: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో ఐదింట నాలుగు విజయాలతో గ్రూప్-2 టాపర్ హోదాలో సెమీస్ చేరింది టీమిండియా. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా గురువారం (నవంబరు 10) జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.
రోహిత్‌కు గాయం
కెప్టెన్ రోహిత్ శర్మ సైతం నెట్స్‌లో సాధన ఆరంభించాడు. అయితే, ప్రాక్టీస్ సమయంలో రోహిత్ ముంజేయికి గాయమైనట్లు సమాచారం. షాట్ ఆడే క్రమంలో అతడి కుడి ముంజేతికి బంతి తగిలినట్లు తెలుస్తోంది. దీంతో హిట్‌మ్యాన్ ఇబ్బందికి గురికాగా.. వెంటనే స్పందించిన సిబ్బంది అతడికి చికిత్స అందించింది.
ఆ తర్వాత ఒక బంతి మాత్రమే ఎదుర్కోగలిగిన రోహిత్.. చేయి నొప్పి తగ్గకపోవడంతో నెట్ సెషన్ నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. గంటన్నర విశ్రాంతి తర్వాత అతడు మళ్లీ బ్యాట్ పట్టినట్లు తెలుస్తోంది. ఏ ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేసినప్పటికీ ఒకవేళ నొప్పి తిరగబెడితే మాత్రం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయ్యో ‘హిట్‌మ్యాన్’ లేకుంటే ఎలా?
ఈ నేపథ్యంలో సెమీస్‌కు ముందు హిట్‌మ్యాన్ ఇలా గాయపడటం పట్ల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తనదైన రోజున పొట్టి ఫార్మాట్‌లో చెలరేగి ఆడగల బ్యాటర్, విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన రోహిత్‌కు గాయమైతే టీమిండియాకు ఇబ్బందులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో బ్యాటర్‌గా రోహిత్ తన స్థాయికి తగ్గట్లుగా ఆకట్టుకోలేకపోయాడు. నెదర్లాండ్స్‌పై అర్ధ శతకం మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ (4, 53, 15, 2, 15 పరుగులు) ఆడలేకపోయాడు.
చదవండి: Aus Vs Eng: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా!
T20 WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
Indian captain Rohit Sharma hit on his right hand during a practice session in Adelaide ahead of the semi-final match against England. pic.twitter.com/HA4xGJDC51
— ANI (@ANI) November 8, 2022
Comments
Please login to add a commentAdd a comment