Update: భారీ విజయం సాధించి రన్‌రేటును మరింత మెరుగుపరచుకోవాలన్న భారత్ ఆశలకు అఫ్గనిస్తాన్ బ్రేక్ వేసింది. సమీకరణల అంచనాలను తారుమారు చేస్తూ.. 144 వరకు స్కోరు చేయగలింది. టీమిండియాతో మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఓడినప్పటికీ... రన్‌రేటు విషయంలో మాత్రం భారత్ కంటే ముందే ఉంది.
స్కోర్లు:
భారత్ - 210/2 (20)
అఫ్గనిస్తాన్ - 144/7 (20)
T20 World Cup 2021 Ind Vs Afg: టీ20 ప్రపంచకప్2021లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందిన టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. అయితే ఆఫ్గనిస్తాన్‌తో నవంబరు 3 నాటి కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా చేలరేగి ఆడింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్గనిస్తాన్ ముందు ఉంచింది.
తద్వారా.. సెమీస్‌కు దూసుకువెళ్లే దారులకు బలమైన పునాది వేసుకుంది టీమిండియా. ఆఫ్గనిస్తాన్‌ను 99 పరుగుల లోపు ఆలౌట్ చేయగలితే .. టీమిండియా రన్‌రేట్ న్యూజిలాండ్, ఆఫ్గాన్ జట్టుల రన్‌రేట్‌ల కంటే మెరుగు పడుతుంది. దీంతో సెమీస్ రేస్‌లో భారత్ నిలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక ఆఫ్గన్‌తో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతుండటం సానుకూల అంశం. టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే నబీ బృందాన్ని తక్కువ స్కోరుకే కట్టడి చేసేలా కనిపిస్తున్నారని.. అదే జరిగితే సెమీస్ అవకాశాలు మెరుగు పడతాయని విశ్లేషకులు అంటున్నారు.
అలా జరగనట్లయితే..
అలా జరగని పక్షంలో... ఒకవేళ ఆఫ్గనిస్తాన్ 120 పరుగులు చేసి... కోహ్లి సేన గనుక వాళ్లను 90 పరుగుల తేడాతో ఓడిస్తే.. టీమిండియా నెట్ రన్‌రేటు +0.50 అవుతుంది. అదే సమయంలో ఆఫ్గన్ రన్‌రేటు +1.20.
ఒకవేళ నబీ బృందం 140 పరుగులు చేయగలిగితే... భారత్ రన్‌రేటు +0.1కు పడిపోతుంది. ఆఫ్గన్ +1.40తో మరింత బలపడుతుంది.
అదీ కాకుండా ఆఫ్గన్ 160 పరుగులు చేస్తే.. భారత జట్టు పరిస్థితి అధ్వానం(-0.20)గా తయారవుతుంది. ఇక 180 పరుగులు గనుక సాధిస్తే... పరిస్థితి మరింత( -0.60) దిగజారుతుంది. అదే సమయంలో ఆఫ్గన్ రన్‌రేటు దాదాపు 2(+1.90)కు చేరుకుని సెమీస్ అవకాశాలను సుగమం చేసుకుంటుంది.
చదవండి: Babar Azam: దుమ్ములేపిన బాబర్ ఆజం.. వనిందు హసరంగా తొలిసారిగా
Comments
Please login to add a commentAdd a comment