బంగ్లాదేశ్‌లో మూడు వన్డేల సిరీస్‌కు
ముంబై: మూడు వన్డేల స్వల్ప సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న భారతజట్టును ఈ నెల 31న ఎంపిక చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (జూన్ 1న) జరగనున్న బెంగళూరులోనే జట్టు ఎంపిక జరిగే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.
జూన్ 15-19 మధ్య బంగ్లాతో జరగనున్న మూడు వన్డేల్లో తలపడేందుకు టీమిండియా జూన్ 13న బయల్దేరి వెళ్లనుంది. తిరిగి 20న స్వదేశానికి రానున్న భారత జట్టు ఆ వెంటనే ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనకు వెళ్తుంది. బంగ్లాతో మూడు వన్డేల్లో కొందరు కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తామని సంజయ్ పటేల్ ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో.. కెప్టెన్ ధోని, కోహ్లిలకు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
31న భారత జట్టు ఎంపిక
Published Thu, May 22 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement