ముంబై: ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుత్తాధిపత్యం సాగితేనేమి... భారత జట్టు అద్భుత ఆటతో వరుస విజయాలు సాధిస్తేనేమి... మార్కెట్ పరిస్థితి ముందు మాత్రం తగ్గాల్సి వచ్చింది. భారత టీమ్ స్పాన్సర్‌షిప్ కోసం బిడ్లు వేసేందుకు నిర్ణయించిన కనీస ధరను బీసీసీఐ ఏకంగా 40 శాతం తగ్గించింది. తాజాగా కనీస ధరను ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కోసం రూ. 1.5 కోట్లుగా నిర్ణయించింది.
గతంలో ఇది రూ. 2.5 కోట్లుగా ఉంది. టీమిండియాతో సహారా ఒప్పందం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో బోర్డు కొత్త బిడ్లను ఆహ్వానించింది. ‘ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వివరణ ఇచ్చినా... మరి కొన్ని నిబంధనల సడలింపు చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది. బిడ్డర్ సంస్థ కనీస విలువను రూ.1000 కోట్లనుంచి రూ.100 కోట్లకు, బోర్డుకు ఇవ్వాల్సిన డిపాజిట్‌ను రూ.45 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించారు! ఇటీవలి ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్ వివాదాలే దీనికి కారణమని తెలుస్తోంది. స్పాన్సర్‌షిప్ బిడ్లను ఈ నెల 9న తెరుస్తారు.
మెట్టు దిగిన బీసీసీఐ!
Published Thu, Dec 5 2013 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement