టి20 ప్రపంచకప్ భారత్ గెలుస్తుంది | India can win Twenty20 World Cup: K Srikkanth | Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచకప్ భారత్ గెలుస్తుంది

Published Thu, Nov 19 2015 12:28 AM | Last Updated on Wed, Oct 3 2018 7:16 PM

టి20 ప్రపంచకప్ భారత్ గెలుస్తుంది - Sakshi

టి20 ప్రపంచకప్ భారత్ గెలుస్తుంది

క్రిష్ శ్రీకాంత్ ఆశాభావం
హైదరాబాద్: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌ను గెలిచే సత్తా భారత జట్టుకు ఉందని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయ పడ్డారు. ‘టి20ల్లో భారత్ ప్రదర్శన ఎప్పుడైనా బాగానే ఉంది. ఈ సారి కూడా టీమ్ మరింత మెరు గ్గా ఆడుతుందని నాకు నమ్మకముంది. 2016లో స్వదేశంలో జరిగే ప్రపంచకప్ గెలుస్తుంది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. వర్షం అడ్డు పడకపోతే భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టులోనూ మొహాలి ఫలితం పునరావృతం అయ్యేదని ఆయన అన్నారు.

‘ఏకపక్షంగా తొలి టెస్టు గెలవడంతో టీమిండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. కనీసం మూడు రోజులు ఆట జరిగినా మ్యాచ్ మన సొంతమయ్యేది. కోహ్లి సేనను నిలువరించే సత్తా దక్షిణాఫ్రికా జట్టులో కనిపించడం లేదు. నిలకడగా ఆడుతున్న యువ ఆటగాళ్లతో ఇప్పుడు భారత జట్టు సరైన దిశలోనే పయనిస్తోంది’ అని శ్రీకాంత్ విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement