చహల్ వీడియోపై గేల్‌ కామెంట్‌..! | chahal post a video on instagram but gets trolled | Sakshi
Sakshi News home page

చహల్ వీడియోపై గేల్‌ కామెంట్‌..!

Jan 10 2018 11:42 AM | Updated on Mar 22 2024 11:03 AM

భారత యువ స్పిన్నర్‌ యుజవేంద్ర చహల్ ఈ ఏడాది టీ20లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరిలో జరగనున్న టీ20 కోసం మంగళవారం బెంగళూరులో చహల్‌ కసరత్తులు మొదలుపెట్టాడు. చహల్ ఇస్టాగ్రామ్‌లో తన జిమ్‌ సెషన్‌ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోపై ఆర్‌సీబీ ఆటగాళ్లు(రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), దక్షిణాఫ్రికా స్పీనర్‌ తబ్రాజ్ షమ్సీ, వెస్టిండిస్‌ ఆటగాడు క్రిస్‌గేల్‌, ఇండియా బౌలింగ్‌ కోచ్‌లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేశారు. 

‘ఓ మై గాడ్‌.. ఈజ్‌ దీస్‌ చహల్‌ ఆర్‌ క్రిస్‌గేల్‌’ అని షమ్సీ ఆ వీడియోపై కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన చహల్‌.. నేను క్రిస్‌ గేల్‌ కన్నా ఎక్కువ బరువు ఎత్తగలను. ఇది నా వామప్‌ సెట్‌ అని సమాధానం చెప్పాడు. దీనిపై టీ20ల సింహాం వెస్టిండీస్‌ ప్లేయర్‌ క్రిస్‌గేల్‌ ఆసక్తికరమైన ట్రోల్‌ చేశాడు. ‘నన్ను చంపేయండి’  అని గేల్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. ‘ నీ శక్తికి ఆ డంబెల్స్‌ చాలా తక్కువ. మరిన్ని కేజీలు కలుపుకోవాలి’ అని  గేల్‌, ఫిల్డింగ్‌ కోచ్‌లు ట్రోల్‌ చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement