ఆక్లాండ్: ఈ ఏడాది టి20 ప్రపంచకప్ సాధించడమే తమ లక్ష్యమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఈ ఏడాది వన్డే మ్యాచ్‌ల్ని టి20 చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా మలచుకుంటామని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘టాస్‌తో మాకు పనే లేదు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలం. ప్రపంచంలోని ఏ దేశమైనా... ఎంతటి ప్రత్యర్థులనైనా ఎదుర్కోగలం. భారీస్కోరైనా ఛేదిస్తాం. అంతిమంగా అదే మా లక్ష్యం. ఈ సంవత్సరం టి20 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు. జట్టు మొత్తం సమష్టిగా ఉందని, ఎవరు రాణించినా అందరూ దాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పారు.
‘మా జట్టులో ‘నేను’ అనే పదానికి చోటు లేదు. ఇప్పుడు ‘మనం’ అనేదే జట్టును నడిపిస్తోంది’ అని 57 ఏళ్ల రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయి బలగంతో వచి్చన ఆ్రస్టేలియాను ఓడించడంతో తమ జట్టు మానసిక స్థైర్యం ఏంటో ప్రపంచానికి తెలిసిందని అన్నారు. రాహుల్‌ను బ్యాట్స్‌మన్‌గా కీపర్‌గా వినియోగించుకోవడం జట్టుకు లాభిస్తుందన్నారు. న్యూజిలాండ్ పర్యటనకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో దూరమవడం బాధాకరమని చెప్పారు. కేదార్ జాదవ్‌కు వన్డే జట్టులో దారులు మూసుకుపోయాయనే వార్తల్ని ఆయన ఖండించారు. కివీస్ పర్యటనలో వన్డే క్రికెట్‌లో అతను భాగమేనని అన్నారు. శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment