ఇంగ్లండ్‌కు బయలుదేరిన ధోని సేన | Mahendra Singh Dhoni led Indian team leaves for England tour | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు బయలుదేరిన ధోని సేన

Published Mon, Jun 23 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

ఇంగ్లండ్‌కు బయలుదేరిన ధోని సేన

ఇంగ్లండ్‌కు బయలుదేరిన ధోని సేన

ఇంగ్లండ్‌లో రెండున్నర నెలల సుదీర్ఘ పర్యటన కోసం ధోని సారథ్యంలోని భారత జట్టు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో ధోని సేన తొలుత ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనుంది.

ముంబై: ఇంగ్లండ్‌లో రెండున్నర నెలల సుదీర్ఘ పర్యటన కోసం ధోని సారథ్యంలోని భారత జట్టు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో ధోని సేన తొలుత ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనుంది.
 
 తొలుత మూడు రోజులపాటు జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం తొలి టెస్టు జూలై 9న నాటింగ్‌హామ్‌లో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు జూలై 17 నుంచి 21 వరకు లార్డ్స్‌లో, మూడో టెస్టు 27 నుంచి 31 వరకు సౌతాంప్టన్‌లో నాలుగో టెస్టు ఆగస్టు 7 నుంచి 11 వరకు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో, ఐదో టెస్టు 15 నుంచి 19 వరకు ఓవల్‌లో జరగనున్నాయి. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనుండగా, సెప్టెంబర్ 7న జరిగే ఏకైక టి20 మ్యాచ్‌తో పర్యటన ముగియనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement