ఈ దశాబ్దం మనదే కావాలి: సచిన్ | Sachin Tendulkar Says Virat Kohli's Batch Can Represent India For Next 10 Years | Sakshi
Sakshi News home page

ఈ దశాబ్దం మనదే కావాలి: సచిన్

Published Fri, Sep 23 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

ఈ దశాబ్దం మనదే కావాలి: సచిన్

ఈ దశాబ్దం మనదే కావాలి: సచిన్

కాన్పూర్: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 500వ మ్యాచ్ ఆడుతోన్న కోహ్లి సేన మరో పదేళ్లు కొనసాగాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అభిలషించాడు. వచ్చే 8-10 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చాటాలని కోరాడు. చారిత్రక టెస్టును ప్రత్యక్షంగా తిలకించేందుకు విశిష్ట అతిథిగా విచ్చేసిన సచిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దశాబ్దమంతా భారత్ రికార్డులతో టెస్టు క్రికెట్ దద్దరిల్లాలని ఆకాంక్షించాడు. కోహ్లి సారథ్యంలోని జట్టులో ఆల్‌రౌండ్ నైపుణ్యముందని కితాబిచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్ విషయంలో ప్రస్తుత జట్టులో చక్కని సమతౌల్యం ఉందన్నాడు. మరో దశాబ్దం పాటు కోహ్లి సైన్యం భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, వాళ్లంతా పూర్తి ఫిట్‌నెస్‌తో ఆటను ఆస్వాదించాలని సచిన్ శుభాకాంక్షలు తెలిపాడు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement