మూడు మ్యాచ్‌లు ముగిసినా తొలి విజయం కోసం వేచి చూస్తున్న భారత జట్టు నిరీక్షణ శనివారం ముగిసే అవకాశం కనిపిస్తోంది. హాకీ ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడనుంది.
నేడు మలేసియాతో భారత్ పోరు
హాకీ ప్రపంచకప్
సాయంత్రం గం. 6.00 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో
ది హేగ్ (నెదర్లాండ్స్): మూడు మ్యాచ్‌లు ముగిసినా తొలి విజయం కోసం వేచి చూస్తున్న భారత జట్టు నిరీక్షణ శనివారం ముగిసే అవకాశం కనిపిస్తోంది. హాకీ ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో జరిగే లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడనుంది.
ఈ గ్రూప్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. అయితే బలహీన జట్టు అని అలసత్వాన్ని ప్రదర్శిస్తే సర్దార్ సింగ్ బృందానికి మొదటికే మోసం వచ్చే అవకాశముంది. ‘బెల్జియం, ఇంగ్లండ్ జట్లతో ఆరంభ రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు చక్కగా ఆడింది. అయినప్పటికీ చివరి నిమిషాల్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. మలేసియాపై గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నాను. ఫార్వర్డ్స్ తమకు అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలుస్తారని విశ్వసిస్తున్నాను’ అని కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు.