సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 13న హైదరాబాద్‌లో జరిగే చివరి టి20 మ్యాచ్ కోసం నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి www.eventsnow.comలో టికెట్లను కొనుగోలు చేయవచ్చని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. మ్యాచ్‌కు వారం రోజుల ముందు అక్టోబర్ 7 నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లలో నేరుగా టికెట్లు కొనుక్కోవచ్చు. టికెట్ ధరలను రూ. 800, రూ. 1,000, రూ. 1,500, రూ.7,500, రూ.12,500లుగా నిర్ణయించా రు. కార్పొరేట్ బాక్స్‌లకు సంబంధించిన ఒక్కో టికెట్ రూ. 20 వేలకు లభిస్తుంది. మొత్తం 39,632 టికెట్లు కొనుగోలు కు అందుబాటులో ఉన్నాయని హెచ్‌సీఏ వెల్లడించింది.
కాంప్లిమెంటరీ పాస్‌లు లేవు...
సాధారణ ప్రేక్షకులకు కేటాయించిన స్టాండ్‌లకు సంబంధించి అన్ని టికెట్లు అమ్ముతున్నామని... తొలిసారిగా ఒక్క కాంప్లిమెంటరీ పాస్‌ను కూడా ఇవ్వడంలేదని హెచ్‌సీఏ కార్యదర్శి టి.శేష్ నారాయణ్ తెలిపారు. నకిలీ టికెట్లకు అవకాశం లేకుండా... కొత్త తరహా టెక్నాలజీతో మ్యాచ్ టికెట్లను ముద్రిస్తున్నామని ఆయన తెలిపారు.
కనీస టికెట్ రూ. 800
Published Sat, Sep 30 2017 12:55 AM | Last Updated on Sat, Sep 30 2017 3:22 AM
Advertisement