ప్రస్తుత భారత జట్టును మరింత మెరుగు పరిచేందుకు మాజీ ఆటగాళ్లు తమ వంతు పాత్ర నిర్వహించాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
కోల్‌కతా: ప్రస్తుత భారత జట్టును మరింత మెరుగు పరిచేందుకు మాజీ ఆటగాళ్లు తమ వంతు పాత్ర నిర్వహించాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే వారికి అంత సమయం ఉందా అనేది ప్రశ్నార్థకమని అన్నాడు. ఫ్లెచర్ స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని ఇటీవల సునీల్ గవాస్కర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ‘సచిన్, కుంబ్లే, ద్రవిడ్‌లాంటి ఆటగాళ్లు మనకున్నప్పుడు వారిని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అయితే ఈ కొత్త బాధ్యతను తీసుకోవడం వారికున్న సమయంపై ఆధారపడి ఉంటుంది.
ఏడాదికి 11 నెలలు జట్టు కోసం కేటాయించే సమయం తన దగ్గర లేదని ద్రవిడ్ స్పష్టం చేసిన విషయాన్ని గమనించాలి. కోచ్ పదవి ఎంత కష్టమో వకార్‌ను అడిగితే తెలుస్తుంది’ అని దాదా తెలిపాడు. బెంగాల్ క్రికెట్ సంఘం చేపట్టిన విజన్-2020 ప్రణాళికలో భాగంగా వకార్ యూనిస్, మురళీధరన్ బెంగాల్ బౌలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.