టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. వీరితో పాటు వివిధ క్రీడాంశాల్లో రాణించిన బెంగాల్ క్రీడాకారులను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఘనంగా సన్మానించారు.
కోల్‌కతా: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. వీరితో పాటు వివిధ క్రీడాంశాల్లో రాణించిన బెంగాల్ క్రీడాకారులను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఘనంగా సన్మానించారు.
జీవితకాల సాఫల్య పురస్కార గ్రహీతలకు రూ. 5 లక్షల నగదు పారితోషికం ఇచ్చారు. పేస్ తరఫున అతని తండ్రి వేస్ పేస్ ఈ అవార్డు అందుకున్నారు. పేస్ ప్రస్తుతం థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడుతున్నాడు. ప్రోత్సాహక బహుమతి పొందిన వారిలో యువ క్రికెటర్ మనోజ్ తివారీ ఉన్నాడు. ఇతనికి ‘ఖేల్ సమ్మాన్’ పురస్కారం లభించింది.