U19 Asia Cup 2021: India Squad Announced, Yash Dhull To Lead Rishith Reddy Got Place: ఏసీసీ ఆసియా అండర్ 19 కప్-2021నేపథ్యంలో ఆల్‌ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా డిసెంబరు 23 నుంచి ఆరంభం కానున్న టోర్నీ కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఢిల్లీ క్రికెటర్ యశ్ ధుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వినోద్ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు(302) సాధించిన బ్యాటర్లలో ఒకడైన యశ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డికి ఈ జట్టులో చోటు దక్కడం విశేషం.
ఇటీవల బంగ్లాదేశ్‌తో తలపడిన ఇండియా ఏ జట్టులో భాగమైన రిషిత్.. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా.. మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా.. డిసెంబరు 11 నుంచి 19 వరకు జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే 25 మంది సభ్యుల జట్టును కూడా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు ఏడు సార్లు అండర్ 19 ఆసియా కప్ గెలిచిన భారత జట్టు ఈసారి కూడా ఎలాగేనా చాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక 2019లో బంగ్లాదేశ్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే.
ఇండియా అండర్ 19 ఆసియా కప్ జట్టు
హర్నూర్ సింగ్ పన్ను, అంగ్‌క్రిష్ రఘువన్శి, అన్ష్ గోసాయి, ఎస్ కే రషీద్, యశ్ ధుల్(కెప్టెన్), అనేశ్వర్ గౌతమ్, సిద్దార్థ్ యాదవ్, కౌశల్ థంబే, నిశాంత్ సింధు, దినేశ్ బనా(వికెట్ కీపర్), రాజంగడ్ బవా, రాజ్‌వర్ధన్ హంగ్రేకర్, గర్వ్ సంగ్వాన్, రవి కుమార్, రిషిత్ రెడ్డి, మానవ్ ప్రకాశ్, అమ్రిత్ రాజ్ ఉపాధ్యాయ్, విక్కీ ఒత్వాల్, వాసు వట్స్.
స్టాండ్ బై ప్లేయర్స్:
ఆయుశ్ సింగ్ ఠాకూర్ ,ఉదయ్ సహరాన్, షశ్వత్ దంగ్వాల్, ధనుశ్ గౌడ, పీఎం సింగ్ రాథోడ్.
చదవండి: Vijay Hazare Trophy: సెంచరీలతో చెలరేగిన రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్
NEWS 🚨: India U19 squad for Asia Cup & preparatory camp announced.
— BCCI (@BCCI) December 10, 2021
More details 👇https://t.co/yJAHbfzk6A
Comments
Please login to add a commentAdd a comment