
మేరీకోమ్‌కు అవకాశం
న్యూఢిల్లీ: ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో మహిళా స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్‌కు స్థానం లభించింది. వచ్చే నెలలో 4 నుంచి 6 వరకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఈ టోర్నీ జరుగుతుంది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) ఎంపిక చేసిన ఆరుగురు సభ్యులుగల భారత బృందంలో మేరీకోమ్ రూపంలో ఏకైక మహిళా బాక్సర్‌ను ఎంపిక చేశారు.
రోహిత్ టొకాస్, మనోజ్ కుమార్, దేవాన్షు జైస్వాల్, ప్రవీణ్ కుమార్, సతీశ్ కుమార్ జట్టులోని ఇతర సభ్యులు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు.