షూ లేకుండా...
సాక్షి, ఢాకా: ఒకరోజు విరామం తర్వాత భారత జట్టు మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం ఢాకాలోని బీసీబీ అకాడమీలో భారత క్రికెటర్లు సుమారు గంటన్నరసేపు ఫుట్‌బాల్ ఆడారు. అయితే కాళ్లకు షూ లేకుండా, ఒట్టి కాళ్లతోనే ఆడారు. మరి గాయాలైతే..? దెబ్బ తగలకుండా ఉండే ప్లాస్టిక్ తరహా బంతితో ఆడారు. ఎందుకిలా..? ‘ట్రైనర్ సూచన మేరకు ఒక రోజు ఇలా సరదాగా ఆడుతున్నారు’ అని జట్టు ప్రతినిధి చెప్పాడు.
ఇదే విషయాన్ని కెప్టెన్ ధోని వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ‘పైసే ఖతమ్ హో గయే’ (మా వద్ద డబ్బులు అయిపోయాయి) అంటూ తనదైన శైలిలో సరదాగా సమాధానం ఇచ్చాడు. యువరాజ్ ఎడమ చీలమండకు బ్యాండేజి ఉండటంతో అతనికి గాయమైందా అని భారత జట్టు ఫిజికల్ ట్రైనర్ నితిన్ పటేల్‌ను అడిగితే... ‘నన్ను ఎందుకు అడుగుతున్నారు. మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వలేను’ అంటూ వెళ్లిపోయారు.