భారత్ ఓటమి | Fed Cup: Sania Mirza-led Indian team to remain in Group II after losing to Hong Kong | Sakshi
Sakshi News home page

భారత్ ఓటమి

Published Sat, Feb 8 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

Fed Cup: Sania Mirza-led Indian team to remain in Group II after losing to Hong Kong

అస్తానా (కజకిస్థాన్): ఫెడరేషన్ కప్ మహిళల టీమ్ టెన్నిస్‌లో భారత జట్టు వచ్చే ఏడాది కూడా ఆసియా ఓసియానియా గ్రూప్-2లోనే కొనసాగనుంది. హాంకాంగ్‌తో శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సానియా నేతృత్వంలోని భారత జట్టు 1-2తో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్ 3-0తో తుర్క్‌మెనిస్థాన్‌పై గెలిచింది. హాంకాంగ్, ఫిలిప్పీన్స్ జట్ల మధ్య  ఫైనల్లో నెగ్గిన జట్టు వచ్చే ఏడాది గ్రూప్-1 దశకు అర్హత సాధిస్తుంది.
 

 లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ కీలకమ్యాచ్‌లో తడబడింది. తొలి సింగిల్స్‌లో యూడిస్ చోంగ్ 6-2, 6-1తో ప్రార్థనపై, రెండో సింగిల్స్‌లో లింగ్ జాంగ్ 6-4, 6-3తో అంకిత రైనాపై నెగ్గి హాంకాంగ్ విజయాన్ని ఖాయం చేశారు.  డబుల్స్‌లో రిషిక సుంకర-అంకిత రైనా జంట 6-2, 6-1తో క్వాన్ యావు-హో చింగ్ వూ జోడిపై గెలిచినా ఫలితం లేకపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement