భారత జట్టుకు మూడో స్థానం
వరల్డ్ కప్ టెన్నికాయిట్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వరల్డ్ కప్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు మూడో స్థానంతో సంతృప్తి పడింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నీ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 6 పాయింట్లు మాత్రమే సాధించింది. జర్మనీ (12 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పురుషుల సింగిల్స్‌లో సంతోష్ కుమార్ 6వ, గోవింద్ 9వ స్థానం దక్కించుకున్నారు.
మహిళల విభాగంలో రమాదేవి 9వ, రేణుక 10వ స్థానాల్లో నిలిచారు. పురుషుల డబుల్స్‌లో రాకేశ్-సర్నోవల్ జంటకు 7వ స్థానం, మహిళల్లో రేణుక-అమృత జోడికి 8వ స్థానం, మిక్స్‌డ్ డబుల్స్‌లో గోవింద్ రాణే-రమాదేవి జంటకు 8వ స్థానం దక్కాయి.
2018లో ఈ టోర్నీ బెలారస్‌లో జరుగుతుందని భారత టెన్నికాయిట్ సమాఖ్య కార్యదర్శి లక్ష్మీకాంతం న్యూస్‌లైన్‌కు తెలిపారు. భారత్ కంటే మిగతా దేశాల ఆటతీరు చాలా మెరుగ్గా ఉందన్నారు. నిబంధనల్లో స్వల్ప తేడాల వల్ల భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని చెప్పారు.