అండర్-19 ప్రపంచకప్
మిర్‌పూర్: అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను నేడు (శనివారం) న్యూజిలాండ్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడిన కుర్రాళ్లు ఆరంభంలో బ్యాటింగ్‌లో తడబడ్డారు. సర్ఫరాజ్, సుందర్ ఆటతీరుతో గట్టెక్కిన భారత్ నేటి వన్డేలో తమ టాప్ ఆర్డర్‌లో లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. కెప్టెన్ ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, అర్మాన్ జాఫర్ బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సుందర్‌ను వన్‌డౌన్‌లో ఆడించే అవకాశాలున్నాయి. మరోవైపు తమ ప్రారంభ మ్యాచ్‌లో కివీస్‌కు నేపాల్ చేతిలో షాక్ తగిలింది. అనూహ్య రీతిలో 32 పరుగుల తేడాతో ఓడిన ఈ జట్టు భారత్‌తో సత్తా చూపాలనే కసితో ఉంది. అన్ని రంగాల్లోనూ కివీస్‌కన్నా భారత్ పటిష్టంగా ఉంది.
ఇంగ్లండ్ విజయం
శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. ఫిజిపై జింబాబ్వే జట్టు 7 వికెట్ల తేడాతో గెలవగా... నమీబియా 9 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది.
నేడు భారత్, కివీస్ పోరు
Published Sat, Jan 30 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM
Advertisement