
రాణించిన మిథాలీ
మహిళల టి20 ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. చెత్త ఆటతో సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన భారత్.. గ్రూప్‘బి’ చివరి లీగ్‌లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది.
చివరి మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ గెలుపు
మహిళల టి20 ప్రపంచ కప్
సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. చెత్త ఆటతో సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన భారత్.. గ్రూప్‘బి’ చివరి లీగ్‌లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఈ గ్రూప్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్, డాట్టిన్ అర్ధసెంచరీ (57)తో 20 ఓవర్లలో 7 వికెట్లకు 117 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారత్ 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పూనమ్ రౌత్ (52 బంతుల్లో 56; 7 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ (52 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. బుధవారం జరిగే 2016 టి20 ప్రపంచకప్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో భారత్; శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడతాయి.