భారత యువ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ ఈ ఏడాది టీ20లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరిలో జరగనున్న టీ20 కోసం మంగళవారం బెంగళూరులో చాహల్ కసరత్తులు మొదలుపెట్టాడు. చహల్ ఇస్టాగ్రామ్‌లో తన జిమ్ సెషన్ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోపై ఆర్‌సీబీ ఆటగాళ్లు(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), దక్షిణాఫ్రికా స్పీనర్ తబ్రాజ్ షమ్సీ, వెస్టిండిస్ ఆటగాడు క్రిస్‌గేల్, ఇండియా బౌలింగ్ కోచ్‌లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు.
‘ఓ మై గాడ్.. ఈజ్ దీస్ చాహల్ ఆర్ క్రిస్‌గేల్’ అని షమ్సీ ఆ వీడియోపై కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన చాహల్.. నేను క్రిస్ గేల్ కన్నా ఎక్కువ బరువు ఎత్తగలను. ఇది నా వామప్ సెట్ అని సమాధానం చెప్పాడు. దీనిపై టీ20ల సింహాం వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ ఆసక్తికరమైన ట్రోల్ చేశాడు. ‘నన్ను చంపేయండి’ అని గేల్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ నీ శక్తికి ఆ డంబెల్స్ చాలా తక్కువ. మరిన్ని కేజీలు కలుపుకోవాలి’ అని గేల్, ఫిల్డింగ్ కోచ్‌లు ట్రోల్ చేశారు.
గత సంవత్సరం ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున చాహల్ 13 మ్యాచ్‌లు ఆడాడు. ఆర్సీబీ జట్టులో అత్యధిక వికెట్లను సాధించిన రెండో ఆటగాడు చహల్. అతను 2016 ఐపీఎల్‌లో 21 వికెట్లను తీశాడు. ఇప్పటివరకు 56 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన చాహల్ 70 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా 2018 ఐపీఎల్‌కు ఆర్‌సీబీ చాహల్ను అంటిపెట్టుకోలేదు. ఆర్‌సీబీ యాజమాన్యం 2018 ఐపీఎల్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లి, ఎబీ డివిలియర్స్, సర్ఫారాజ్ ఖాన్‌లను అంటి పెట్టుకుంది. ప్రస్తుతం చాహల్ పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment