నేపాల్‌పై భారత్ గెలుపు | world cup foot ball | Sakshi
Sakshi News home page

నేపాల్‌పై భారత్ గెలుపు

Published Fri, Mar 13 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

world cup foot ball

 ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్
 గువాహటి: స్టార్ స్ట్రయికర్ సునీల్ చెత్రి సూపర్ షోతో అదరగొట్టడంతో ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో భారత జట్టు 2-0తో నేపాల్‌ను ఓడించింది. గురువారం ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెత్రి 53, 69వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. 80వ నిమిషంలో హ్యాట్రిక్ గోల్ కోసం ప్రయత్నించినా తన స్పాట్ కిక్ విఫలమైంది. 17న రెండో అంచె మ్యాచ్ ఖాట్మండులో జరుగుతుంది.
 
 భూటాన్ సంచలన విజయం: తమ ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలోనే భూటాన్ అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో అట్టడుగున (209) ఉన్న భూటాన్ తమ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0తో గెలిచింది. 81వ నిమిషంలో షెరింగ్ డోర్జి ఈ గోల్ సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement