ఐపీఎల్ ఉత్కంఠ
- నేడు తలపడనున్న బెంగళూరు, హైదరాబాద్ జట్లు
- ‘చెన్నై’ పేలుళ్ల నేపథ్యంలో ‘చిన్నస్వామి’కి భారీ భద్రత
- రంగంలోకి సాయుధ బలగాలు, సీసీ కెమెరాల ఏర్పాటు
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో ఐపీఎల్ సందడి నెలకొంది. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. గతంలో చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబు పేలుళ్లు, ప్రస్తుతం చెన్నై రైల్వే స్టేషన్‌లో పేలుళ్ల నేపథ్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది సిటీ పోలీసులకు రంగంలోకి దింపారు. శనివారం నుంచే భారీ స్థాయిలో పోలీసులను మొహరించారు. డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అంవాఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రతలు తీసుకున్నారు.
స్టేడియం పరిసర ప్రాంతాల్లో 12 వాచ్ టవర్లను (పోలీసులు బైనాక్యూలర్లతో పరిశీలించేందుకు ఎతైన టవర్లు) ఏర్పాటు చేశారు. మ్యాచ్‌కు వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించడానికి 87 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహాత్మగాంధీ సర్కిల్ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి స్టేడియం లోపలికి పంపించేలా చర్యలు తీసుకున్నారు. సాయుధ బలగాలతో పాటు కేఎస్‌ఆర్‌పీ బలగాలనూ రంగంలోకి దింపారు. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతా ల్లో పార్కింగ్ నిషేధించారు. మ్యాచ్ చూసి ఇంటికి వెళ్లే వారికి కోసం బీఎంటీ సీ అధికారులు జీ-1 నుంచి జీ-12 వరకు ప్రత్యేక సర్వీలు ఏర్పాటు చేశారు.